ముంబై: అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లో ఉండే పెంపుడు కుక్క మృతిచెందడంతో అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. ఫోటోను షేర్ చేసిన అమితాబ్ ఓ కామెంట్ కూడా చేశారు. హమారే ఏక్ చోటే సే దోస్త్, కామ్ సే షాన్, ఫిర్ యే బడే హోతే హై ఔర్ ఏక్ దిన్ చోడ్ కే చల్ జాతే హై అని క్యాప్షన్ ఇచ్చారు. ఏడుస్తున్నట్లు ఓ ఎమోజీని కూడా ఆయన పోస్టు చేశారు. అమితాబ్ ఫోటో పెట్టిన కొన్ని క్షణాల్లోనే ఆయన అభిమానులు రియాక్ట్ అయ్యారు. కామెంట్ల సెక్షన్లో హార్ట్‌బ్రేక్ ఎమోజీలను పోస్టు చేశారు.