Amitabh Bachchan – Allu Arjun | పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అల్లు అర్జున్‌పై పలు సందర్బాల్లో బిగ్ బీ ప్రశంసలు కురిపించగా.. తాజాగా మరోసారి బన్నీ గురించి అమితాబ్ మాట్లాడారు. 15 ఏండ్లుగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో 16 సీజన్ రీసెంట్గా ప్రసారమవుతోంది.
ఈ షో తాజా ఎపిసోడ్లో కోల్‌కతాకు చెందిన ఓ గృహిణి కంటెస్టెంట్‌గా హాజరు అయ్యింది. అయితే షోలో భాగంగా అమితాబ్‌తో మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్, అమితాబ్ అంటే ఇష్టమని తెలిపింది. దీనికి బీగ్ బీ స్పందిస్తూ.. నేను కూడా అల్లు అర్జున్‌కి అభిమానిని. ఆయనతో నన్ను పోల్చవద్దు. ఆయన నటించిన పుష్ప 2 చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మీరు చూడకపోతే వెంటనే చూసేయండి తాను ఎంతో టాలెంట్డ్ యాక్టర్. తనకు వచ్చిన గుర్తింపులన్నిటికీ పూర్తి అర్హుడు అంటే బిగ్ బీ చెప్పుకోచ్చాడు.
Also Read..