బాలీవుడ్ పెహన్ షా అమితాబ్ బచ్చన్ నటుడిగానే కాదు హోస్ట్‌గాను అదరగొడుతున్నాడు. ఏడు పదుల వయస్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి షోని హోస్ట్ చేస్తున్నారు. జూలై 3, 2000న రాత్రి 9గం.లకు అమితాబ్ హోస్ట్‌గా కౌన్ బనేగా కరోడ్ పతి తొలి ఎపిసోడ్ ప్రారంభం కాగా, ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతుంది. కరోనా సమయంలోను షోని సక్సెస్ ఫుల్‌గా నడిపించారు.
శుక్రవారంతో షో 1000వ ఎపిసోడ్‌ను పూర్తిచేసుకోనుంది. ప్రత్యేకమైన ఎపిసోడ్లో బిగ్‌బీ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నంద పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్‌లోని ఉత్తమ క్షణాలను వీడియో రూపంలో విడుదల చేశారు. 21 ఏళ్ల జర్నీలో 13 సీజన్స్ జరగగా, బిగ్ బీ ఈ షోని సక్సెస్ ఫుల్‌గా నడిపించారు. ఈ షోతో ఎందరో కోటీశ్వరులు కాగా, ఒకరు 5 కోట్లు,ఇంకొంకరు ఏడు కోట్లు గెలుచుకున్నారు. చిన్న పిల్లలు కూడా షోతో కోటీశ్వరులయ్యారు.
21 ఏళ్ల ఎమోషనల్ జర్నీని వీడియో ప్రోమోలో చూపించారు. అయితే 1000వ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చిన శ్వేతా.. ప్రోమో చూశాక తండ్రి అమితాబ్‌ను ఎలా ఫీల్ అవుతున్నారని అడిగింది. అందుకు బిగ్‌బీ కన్నీళ్లు పెట్టుకుంటూ ‘నా ప్రపంచం మొత్తం మారిపోయింది.’ అని బదులిచ్చారు. ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా, మూడో సీజన్‌కి అమితాబ్ అనారోగ్యం కారణంగా హోస్ట్ చేయలేకపోయారు. ఆయన స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు.
https://www.instagram.com/tv/CW1vbACKRCH/?utm_source=ig_web_copy_link