Kaun Banega Crorepati| కౌన్ బనేగా కరోడ్ పతి ఈ షో ఆధారంగానే పలు భాషలలో ఇలాంటి షోలు రూపొంది మంచి సక్సెస్ అయ్యాయి. అయితే హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వస్తోన్న ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి ఎంతో మందికి మంచి వినోదం పాటు విజ్ఞానం కూడా అందించింది. హోస్ట్ సీట్లో అమితాబ్ బచ్చన్ తప్ప మరో సెలబ్రిటీని ఎవరు కూడా పెద్దగా ఊహించుకోలేకపోయారు. ఇటీవలే 16వ సీజన్ పూర్తి కాగా.. ఈ షో హోస్ట్ నుంచి అమితాబ్ తప్పుకుంటారనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. బిగ్ బి ఈ షోను వీడుతున్నట్లు వార్తలు రావడంతో అభిమానుల గుండె పగిలినం పని అయింది. అయితే ఒకవేళ అమితాబ్ బచ్చన్ ‘KBC’ నుంచి వెళ్ళిపోతే ఆయన స్థానంలో షారూఖ్ ఖాన్ లేదా ఐశ్వర్యరాయ్ హోస్ట్‌గా వస్తారని కూడా ప్రచారం జరిగింది.
గత కొద్ది రోజులుగా ఇలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిగ్ బీ క్లారిటీ ఇచ్చేశారు. 16వ సీజన్ చివరి ఎపిసోడ్లో మాట్లాడిన ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ అన్ని రూమర్స్‌కి చెక్ పెట్టారు. గత 16 సీజన్లలో కౌన్ బనేగా కరోడ్‌పతి విశేష ఆదరణ పొందింది. నేను హోస్ట్‌గా వ్యవహరించిన ప్రతిసారీ ఆడియన్స్ నుంచి నాకు ఎంతో ప్రేమ మద్దతు లభించింది. గత 25 ఏళ్లుగా మమ్మల్ని అదే ప్రేమ, మద్దతు నిలబెట్టింది. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం నిజంగా విజయవంతమైందని నేను నమ్ముతున్నాను. ఇక లేడిస్ అండ్ జెంటిల్మెన్ వచ్చే సీజన్లో మళ్లీ మిమ్మల్ని కలుస్తాను. మీ కృషిని నమ్మండి, కలలని సజీవంగా ఉంచుకోండి.
ఎక్కడ ఆగకండి, ఎవరికి తలవంచకండి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటే వారు విలువైన వారు. ఈ సీజన్ నుండి నిష్క్రమిస్తున్నాను. తిరిగి వచ్చే సీజన్లో కలుద్దాం అని అమితాబ్ బచ్చన్ అనడంతో వచ్చే సీజన్‌కి కూడా ఆయనే హోస్ట్‌గా ఉంటారని అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక అమితాబ్ విషయానికి వస్తే 80 ఏళ్ల వయస్సులో కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు.షోలు, సినిమాలతో సందడి చేస్తున్నారు. గతేడాది ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’లో అశ్వత్థామ పాత్రలో మెప్పించిన ఆయన రజినీ వేట్టయాన్ సినిమాలో జస్టిస్ సత్యదేవ్‌గా కనిపించి అలరించారు. ప్రస్తుతం అమితాబ్ ‘రామాయణ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.