Amitabh Bachchan | సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అమితాబ్ బచ్చన్ ఎక్స్‌లో తన ప్రతి పోస్ట్‌కి వేసే నెంబర్ని కంటిన్యూ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. అయితే 20 రోజులుగా అమితాబ్ అలా చేయడంతో ఏమైందో అని అటు అభిమానులు, ఇటు ఫాలోవర్స్ టెన్షన్ పడ్డారు. ఇన్ని రోజుల తర్వాత అమితాబ్ మౌనం వీడి.. విషాదకరమైన పహల్గామ్ దాడిని ఎప్పటికీ మరచిపోలేము అంటూ కామెంట్ చేశారు. పహల్గామ్లో సెలవుల కోసం వెళ్లిన అమాయక జంటపై ఉగ్రవాదులు టూరిస్ట్ గైడ్లమని నటిస్తూ దాడి చేశారు.. ఆ వ్యక్తి హిందువు అని తెలియగాని.. అతన్ని కాల్చడానికి సిద్ధమయ్యాడు.. ఆ వ్యక్తి భార్య ముష్కరుడి పాదాలపై పడి చంపవద్దని ప్రాధేయపడిన కూడా కాస్త కనికరం కూడా చూపలేదు. కళ్ల ముందు భార్యని విధవరాలిని చేశాడు.
భార్య తనను కూడా చంపమని వేడుకున్నా.. నేను నిన్ను చంపను.. నువ్వు వెళ్లి మోడీకి చెప్పు..!!“ అని అన్నాడు. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల విషయంలో తాను అనుభవించిన ఆవేదన గురించి అమితాబ్ తన పోస్ట్‌లో ఆవేదనతో రాసుకొచ్చారు. వితంతువు మానసిక స్థితి, దుఃఖం చూసి నేను తీవ్రంగా బాధపడుతున్నాను . నాకు నా తండ్రి రాసిన కవితలోని ఒక వ్యాఖ్యం గుర్తుకు వచ్చింది. కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తే..ఆమె వద్ద చితాభస్మం ఉన్నా సిందూరం ఎక్కడని ప్రపంచం అడుగుతుంది అని నాన్న రాసిన పద్యంలోని లైన్ గుర్తొచ్చింది. అందుకే సిందూరం ఇస్తున్నా అంటూ తాజాగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు.
జైహింద్.. భారత సైన్యమా.. నువ్వు ఎప్పటికీ వెనకడుగు వేయవు.. ప్రయాణం ఎన్నడు ఆగదు అని రాసుకొచ్చారు. కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 26 మందిని దారుణంగా చంపేశారు. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ దాడిలో 100కి పైగా ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం దాడి చేసింది.