బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bacchan) త్వరలోనే 80వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు రెడీ అవుతున్నాడు. అక్టోబర్ 11న 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు బిగ్ బీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై తనదైన ముద్రవేసుకున్న అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన వార్త ఒకటి బీ టౌన్లో హల్ చల్ చేస్తోంది. స్వాంకీ పార్దెనాన్ అపార్ట్మెంట్స్ (swanky Parthenon apartments) లోని 31వ అంతస్థును కొనుగోలు చేశాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
అంధేరిలోని ఫోర్ బంగ్లాస్ ఏరియా (Four Bungalows) లో ఈ అపార్టుమెంట్ ఉన్నట్టు బాలీవుడ్ సర్కిల్ కథనం. సబర్బన్ ప్రాంతంలో ఉన్న నివాస సముదాయాల్లో ఒకటైన ఈ అపార్టుమెంట్ 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట. అయితే ప్రస్తుతం అమితాబ్ ప్రస్తుతం జుహులోని బిల్డింగ్‌లో ఉంటున్నారు. మరి కొత్త ఇంట్లోకి ఏమైనా మారుతారా..? అంటే అలాంటిదేమి లేదని బిగ్ బీ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
అమితాబ్ కొనుగోలు చేసిన ఈ అపార్టుమెంట్ తన మనవరాలి కోసమేనట. పుట్టినరోజు కానుకగా మనవరాలికి ఇచ్చేందుకే ఈ కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేశాడని ఇన్ సైడ్ టాక్. రీసెంట్గా వచ్చిన మల్టీస్టారర్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్రలో కీ రోల్లో నటించారు బిగ్ బీ. ఆయన పాత్రకు మంచి స్పందన వస్తోంది.