Deepika Padukone | బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణె ఇటీవల వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీని వదులుకున్న విషయం తెలిసిందే. దీపికా పడుకోణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న వార్తలు సినిమా ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. పని వేళలు, భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ మూవీ సినిమా స్టోరీని బయటపెట్టారంటూ దీపికాపై డైరెక్టర్ సందీప్ వంగా తీవ్రస్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి దీపికా వైదొలగిసిన తర్వాత యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రిని హీరోయిన్గా తీసుకున్నారు. అయితే, దీపికాకు పలువురు హీరో, హీరోయిన్లు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఇండస్ట్రీలో ఎనిమిది గంటల పని సమయంపై చర్చ సాగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే దీపికా పదుకొణే చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీపికా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. ఇటీవల తన భర్త, నటుడు రణవీర్ సింగ్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు సైతం చెప్పలేదు.
రణవీర్ కొత్త సినిమా ‘ధురంధర్’ ఫస్ట్ లుక్‌పై సైతం స్పందించలేదు. అయితే, శనివారం ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్టు షేర్ చేసింది. దీపికా తన సెల్ఫీని షేర్ చేసింది. అందులో ఫేస్ మాస్క్ ధరించి కనిపించింది. ఆ ఫొటోకు క్యాప్షన్ ఇస్తూ ‘నా కోసం సెల్ఫ్ కేర్ అంటే ప్రతిరోజూ చిన్న చిన్న అలవాట్లను పాటించడం. ఇవి నన్ను సంతోషంగా ఉంచతాయి. ఇప్పుడు సెల్ఫ్ కేర్ మంత్ జరుపుకుంటున్నాం. మీరు కూడా మీ కోసం కాస్త సమయం కేటాయించాలని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్ పెట్టింది. దీపికా సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ నుంచి తప్పుకున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో నటించనున్నది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. వర్క్ టైటిల్ ‘AA22XA6’ పేరు పెట్టారు. ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోలో దీపికా పదుకోన్ ఖడ్గ యుద్ధం చేస్తూ కనిపించింది.