Abhishek Bachchan | బాలీవుడ్ జంట ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్లు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్దికాలంగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎప్పటికప్పుడు చెక్ పెడుతునే ఉంది ఈ జంట. ఇదిలావుంటే తాజాగా ఈ రూమర్స్‌పై తాజాగా స్పందించాడు అభిషేక్ బచ్చన్.
అభిషేక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఖాళిదర్ లాపతా. ఈ సినిమా ఇటీవలే ఓటీటీ వేదికగా నేరుగా విడుదలై మంచి ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న అభిషేక్ ఐశ్వర్యారాయ్‌తో విడాకులపై వస్తున్న వార్తలపై స్పందించాడు.
మేము తరచుగా మా పని గురించి మాట్లాడుకుంటాం, కానీ దానికే ముఖ్య ప్రాధాన్యం ఇవ్వం. చర్చించడానికి మాకు ఇతర విషయాలు కూడా చాలా ఉన్నాయి. నేను సినీ పరిశ్రమలో పెరిగాను కాబట్టి, ఏ విషయాలను తీవ్రంగా పరిగణించాలి, దేన్ని పట్టించుకోకూడదు అనేది నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల వల్ల నేను ప్రభావితం కాను. ముఖ్యంగా, మా అమ్మ, మా భార్య బయటినుంచి వచ్చే వదంతులను మా ఇంటికి తీసుకురారు. మేము అంతా బాగున్నాం అంటూ అభిషేక్ తెలిపారు.