వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో కేథరీన్ ట్రెసా కీలకపాత్రలో ఓ థ్రిల్లర్ చిత్రం రూపొందనుంది. డాక్టర్ మీనాక్షి ఈ చిత్రానికి నిర్మాత. మంగళవారం కేథరిన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాక్షలు తెలుపుతూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్ని రిలీజ్ చేశారు. ప్రేక్షకులకు నచ్చే అంశాలతో, స్ట్రాంగ్ కంటెంట్‌తో ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమా ద్వారా ఎంతోమంది దేశ, విదేశాలకు చెందిన కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామని, తెలుగు, తమిళ, కన్నడ నటీనటులతోపాటు అమెరికన్, స్పానిష్ పీపుల్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఏషియన్స్ చెందిన ఆర్టిస్టులు కూడా ఇందులో నటిస్తారని వీఎన్ ఆదిత్య తెలిపారు. యూఎస్‌లోని డల్లాస్‌లో చిత్రీకరణ జరుపుకునే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి రచన: పద్మావతి మల్లాది, సమర్పణ: ఏయు అండ్ ఐ, నిర్మాణం: ఓ.ఎం.జి.ప్రొడక్షన్స్.