Ameesha Patel | ఇరవై మూడేళ్ల క్రితం ‘కహో నా.. ప్యార్ హే’ సినిమాతో బాలీవుడ్ చిత్ర సీమలోకి అడుగుపెట్టింది అమీషా పాటేల్. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇక అదే ఏడాది పవన్‌తో ‘బద్రి’ సినిమా చేసింది. ఈ సినిమా ఇక్కడ బంపర్ హిట్టయింది. ఇలా ఒకే ఏడాది రెండు ఇండస్ట్రీలలో ఎంట్రీ ఇచ్చి.. రెండిట్లోనూ బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత అమీషా పటేల్‌కే దక్కింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడిపింది. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా బాలీవుడ్లో మాత్రం మూడు, నాలుగేళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసింది.
కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే అమీషా పటేల్ బాలీవుడ్ దర్శక నిర్మాత విక్రమ్ భట్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత అమీషా ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. కాగా తాజాగా ఈ విషయంపై అమీషా సంచలన వ్యాఖ్యలు చేసింది. విక్రమ్ భట్‌తో డేటింగ్ గురించి బహిరంగంగా చెప్పడం తన కెరీర్‌ను నాశనం చేసిందని అమీషా చెప్పింది. ఈ పరిశ్రమలో నిజాయితీకి విలువ లేదు. నిజాయితీగా నా రిలేషన్షిప్ గురించి బయటకు చెప్పడంతో 12-13ఏళ్లు సినిమా చాన్సులు దక్కలేదు. నా కెరీర్ దెబ్బతింది. దీంతో నా లైఫ్‌లోకి మరొకరికి చోటివల్లేదు. ఇప్పుడు శాంతి మాత్రమే నాతో ఉంది. నా జీవితంలో ఇంకేమి అక్కర్లేదు అని అమీషా చెప్పుకొచ్చింది.
బయ్యాజి సూపర్ హిట్ తర్వాత అమీషా ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. మళ్లీ ఆరేళ్ల తర్వాత గదర్-2తో రీ ఎంట్రీ ఇస్తుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యలో తెరకెక్కిన ఈ సినిమా 2001లో వచ్చిన గదర్: ఏక్ ప్రేమ్ కథా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. తొలి సినిమాలో కలిసి నటించిన సన్నీ డియోల్, అమీష్ పటేల్ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.