Ameer Log | మిడిల్ క్లాస్ జీవితాల్ని చూపించే సినిమా.. అమీర్ లోగ్ టీజర్‌పై నిర్మాత వంశీ నందిపాటి
Ameer Log | అమీర్ లోగ్ (Ameer Log) సినిమాతో ఎంతోమంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇలాంటి సినిమా ఆడితేనే సినీ పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుందన్నారు పొలిమేర నిర్మాత వంశీనందిపాటి.
Ameer Log | టాలీవుడ్లో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న చిత్రం అమీర్ లోగ్ (Ameer Log) . ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రమణారెడ్డి సోమ డైరెక్ట్ చేస్తున్నాడు. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ అమీర్ లోగ్ టీజర్‌ను నిర్మాత (పొలిమేర ఫేం) వంశీనందిపాటి విడుదల చేశారు.
మేకర్స్ హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య కథ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ ద్వారా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. టీజర్ లాంచ్‌లో పొలిమేర నిర్మాత వంశీనందిపాటి మాట్లాడుతూ.. అమీర్ లోగ్ మూవీని ఇప్పటికే చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు.. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్. మిడిల్‌క్లాస్ జీవితాన్ని చూపించే ఈ సినిమా చూస్తూ నేనెంతో ఎంజాయ్ చేశా. పక్కా హైదరాబాద్‌ను చూపించిన సినిమాల జాబితాలో ఈ మూవీ ఉంటుందని అన్నారు. ఈ సినిమాతో ఎంతోమంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇలాంటి సినిమా ఆడితేనే సినీ పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుందన్నారు. స్మరణ్ మ్యూజిక్ అందించిన పది పాటలు అద్భుతంగా ఉంటాయన్నారు.
అమీర్ లోగ్ కామెడీతోపాటు కంటెంట్‌ను నమ్మి వస్తున్న సినిమా కావడం మరోవైపు రానా టీం విడుదల చేస్తుండటంతో హైప్ పెరిగిపోతుంది. ఈ మూవీని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తెరకెక్కిస్తున్నారు. అమీర్ లోగ్ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచిందని తెలిసిందే. ఈ మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.

అమీర్ లోగ్ టీజర్..
Galli nunchi event varaku… Full hawa 🥵💥
Watch teaser – https://t.co/xzDyrjRgQx#Ameerlog releasing this August in theatres! 🎥@Awwal_Films #RamanaReddy @SpiritMediaIN @mcharimusic @manojoriginal @frame_it_right @Vedhajalandharr @RaavanNitturu @saiyogi_g @VijaykumarSvk95… pic.twitter.com/YzxrHU05an
— BA Raju’s Team (@baraju_SuperHit) July 6, 2026
Read Also :
Prakash Raj | ‘ప్రశ్న రావణ్’ అరెస్ట్‌పై మరోసారి స్పందించిన ప్రకాష్ రాజ్.. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Pradeep Ranganathan | హీరోగా ఎదురుదెబ్బ.. ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ప్రదీప్ రంగనాథన్!
Trisha | రానాతో రిలేషన్ షిప్‌పై ప్రచారాలు.. త్రిష ఆసక్తికర కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

