Ameer Log | ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం అమీర్ లోగ్ (Ameer Log). యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీని రమణారెడ్డి సోమ డైరెక్ట్ చేస్తున్నాడు. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఇప్పటికే ట్రైలర్ లాంచ్ చేయగా.. మంచి స్పందన వస్తోంది.
కాగా ఈవెంట్లో లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. అమీర్ లోగ్ సాంగ్స్ బాగున్నాయని.. టీజర్, ట్రైలర్ తనకు చాలా నచ్చిందన్నాడు. డైరెక్టర్ రమణ రెడ్డి పెద్ద ఆర్కిటెక్ట్. ఈ సినిమాను ఆయన చాలా అద్భుతంగా తీశారు. అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపించింది. ఈ మూవీ ఫలక్‌నుమా దాస్ రేంజ్లో హిట్టవుతుందనిపిస్తుంది. ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేయాలన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
డైరెక్టర్ రమణా రెడ్డి మాట్లాడుతూ.. అమీర్ లోగ్ సినిమా హైదరాబాద్ ప్రజలకు ప్రతీకగా ఉంటుందని.. అన్ని రకాల ఎమోషన్స్‌తో అందరినీ ఏడ్పిస్తూ.. నవ్వించేలా సినిమా ఉంటుందన్నాడు. హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. డాలర్ డ్రీమ్స్, పెళ్లి చూపులు, బలగం రేంజ్లో తమ అమీర్ లోగ్ సినిమా ఉంటుందని నమ్ముతున్నానన్నాడు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఒక్కో పాట సెపరేట్ స్టైల్లో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. అవ్వల్ దావత్ సాంగ్‌తోపాటు హైదరాబాదీ ర్యాప్ స్టైల్లో సాగే ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.అమీర్ లోగ్ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను టాలీవుడ్ యాక్టర్ రానాకు చెందిన స్పిరిట్ మీడియా సొంతం చేసుకుంది. హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య కథ నేపథ్యంలో కామెడీతోపాటు కంటెంట్‌ను నమ్మి వస్తున్న మూవీని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తెరకెక్కిస్తుండగా.. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..