Prabhas-Maruthi Movie | ప్రభాస్ ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో వైపు మారుతితో ఓ మిడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. చడి చప్పుడు లేకుండా ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం స్పెషల్‌గా డేట్స్ ప్లాన్ చేసుకోకుండా వీలైనప్పుడల్లా షూటింగ్లో పాల్గొంటూ సినిమాను పూర్తి చేస్తున్నాడట. ఇక ఈ ప్రాజెక్ట్‌పై ముందు నుంచే ఎక్కడలేని వ్యతిరేకత వచ్చింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో.. వరుస ఫ్లాపుల్లో ఉన్న మారుతితో సినిమా చేస్తున్నాడని తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఊగిపోయారు. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాలని ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్‌ను సైతం ట్రెండ్ చేశారు.
కానీ ప్రభాస్ అవేమి పట్టించుకోకుండా ఈ సినిమాను సైలెంట్‌గా పూర్తి చేస్తున్నాడు. అయితే ఆ మధ్య ఈ సినిమా సెట్స్ నుండి లీకైన ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. బియర్డ్ లుక్.. టీ షర్ట్ పైన చెక్స్ షర్ట్ వేసుకున్న ఫోటోతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఆనాటి నుంచి కాస్త ట్రోలింగ్ తగ్గింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ముందుగా రాజా డిలక్స్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ మధ్య రాజా డిలక్స్ను కాస్త రాయల్‌గా పేరు మార్చినట్లు కూడా నెట్టింట తెగ చర్చలు జరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా అంబాసిడర్ అనే పేరును చిత్రయూనిట్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో అంబాసిడర్ కారు ముఖ్య పాత్ర పోషించనుందట. అందుకోసం టైటిల్‌ను కూడా అదే పేరుతో పెట్టాలని ఆలోచిస్తున్నారట. అయితే ఈ టైటిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాన్ ఇండియా హీరో సినిమాకు అలాంటి టైటిల్ ఏంటీ అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఈ టైటిల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంజయ్‌దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరుగుతుందట. సంజయ్ దత్ ప్రభాస్‌కు తాతగా కనిపించున్నాడటని టాక్. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవికా మోహన్ నటించనుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో చెలరేగిపోతున్న పీపులు మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.