Matka Movie | తెలుగు సినీ ప్రేక్షకులకు ఈరోజు పండగనే చెప్పుకోవాలి. ఒకవైపు నేడు పుష్ప 2 ది రూల్ విడుదలై థియేటర్లో సందడి చేస్తుంటే.. మరోవైపు ప్రేక్షకులను అలరించడానికి రెండు బడా సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ మట్కాతో పాటు శివ కార్తికేయన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అమరన్లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.
విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది వరుణ్ తేజ్ మట్కా మూవీ. వరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టార్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. మెగా హీరో వరుణ్ తేజ్‌కి ఈ మధ్య అసలు కలిసి రావాట్లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఫిదా, తొలిప్రేమ సినిమాలతో సాలిడ్ హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో కెరీర్ గ్రాఫ్ సడన్‌గా పడిపోయింది. ఆపరేషన్ వాలంటైన్, గాండీవ ధారి అర్జున, గని సినిమాలతో వరుస డిజాస్టార్లను అందుకున్నాడు. ఇప్పుడు మట్కా సినిమాతో తాజాగా మరో డిజాస్టార్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఎంతటి పరజయం అందుకుంది అంటూ కనీసం పెట్టిన బడ్జెట్ కూడా రాకపోవడం విశేషం. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
Siva Karthikeyan | తమిళ అగ్ర కథానాయకుడు శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. శివ కార్తికేయన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.