Amala Paul | నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవి (Thiruvairanikulam Mahadeva temple) దర్శనానికి వెళ్లిన ఆమెను అధికారులు ఆలయం వెలుపలే అడ్డుకున్నారు. బయట నుంచే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని సూచించారు. ఈ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతిస్తారు. అమలాపాల్ క్రిస్టియన్ కావడంతో ఆమెను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, అమ్మవారి దర్శనం కాకపోయినప్పటికీ తాను ఎంతో సంతృప్తితో తిరిగి వెళుతున్నట్టు ఆలయ సందర్శకుల రిజిస్టర్లో తనకు కలిగిన పరాభవాన్ని పంచుకున్నారు అమలాపాల్. ‘అన్యమతస్థురాలిని అని నాకు ఆలయంలోకి అనుమతి ఇవ్వలేదు. తీవ్ర నిరాశకు గురయ్యా. అయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించాను. 2023లో కూడా ఈ మత వివక్ష కొనసాగడం విచారకరం. త్వరలో ఈ మత వివక్షలో మార్పు వస్తుందని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చింది.