జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో ‘కిల్లర్’ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందనుంది. పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో ప్రజయ్ కామత్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం ఈ చిత్రం టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. పవర్ఫుల్ లేడీ, గన్, చెస్ కాయిన్స్‌తో ఆల్ట్రా మోడ్రన్‌గా ఈ పోస్టర్ని మేకర్స్ డిజైన్ చేశారు. దర్శక, నిర్మాత పూర్వాజ్ ఈ చిత్రలో ఓ కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం, నిర్మాణం: థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్.