Allu Arjun Birthday | పుష్ప 2 ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ నేడు తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా అల్లు అర్జున్ బర్త్‌డేకి సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ కేక్ కట్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి నేడు అప్డేట్ రావాల్సి ఉంది.
ICON Star @AlluArjun celebrates his birthday with his family members! #HappyBirthdayAlluArjun #AlluArjun pic.twitter.com/qB7A1aAC8Y
— TalkEnti (@thetalkenti) April 8, 2025