Allu Sneha | అల్లుఅర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు వారి కోడలు అంటే దానికి తగ్గట్లుగానే స్నేహ తన స్టార్ స్టేటస్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ సినిమా విశేషాలు, వెకేషన్ ఫోటోలు, పిల్లల వీడియోలో ఇలా నిత్యం ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాగా తాజాగా ఈ జంట న్యూ ఇయర్ పార్టీ వేడుకల కోసం తన సన్నిహితులతో కలిసి వెకేషన్కు వెళ్లారు.
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోల్లో అల్లు అర్జున్తో దిగిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్లో కనిపించాడు. ఇక ఈ ఫోటోతో వీరిద్ధరూ కలిసి సినిమా చేస్తే బావుంటుంది అని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా స్నేహా రెడ్డి ఉందని, బన్నీ వాళ్లను, వీళ్లను ఎందుకు.. తనకు జోడీగా స్నేహా రెడ్డినే తీసుకుంటే సరిపోతుంది కదా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టనుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీకు జోడీగా రష్మిక నటిస్తుంది. మాలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. పుష్ప గ్రాండ్ సక్సెస్ అవడంతో పార్టు-2పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.