‘ఏదైనా కొత్త పాయింట్‌తో సినిమా చేద్దామని ఎదురుచూస్తున్న సమయంలో ‘బడ్డీ’ కథ విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇందులో నేను పైలైట్ పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’ అన్నారు అల్లు శిరీష్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సందర్భంగా గురువారం అల్లు శిరీష్ పాత్రికేయులతో ముచ్చటించారు.