ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ ఫాలో అవ్వడంలో యంగ్ హీరో అల్లు శిరీష్ ఎప్పుడూ ముందుంటాడు. సరికొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటాడు ఈ అల్లు వారబ్బాయి. ఈ మధ్యే సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించిన అల్లు శిరీష్ (Allu Sirish). సోషల్ మీడియా వేదికగా ఫిట్నెస్ పాఠాలు కూడా నేర్పించాడు. ఈయన చేసిన కఠినమైన వర్కౌట్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అల్లు శిరీష్ మేకవర్కు జేజేలు పలికారు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన చేసిన సూపర్ హీరో (Super Hero Photoshoot) ఫోటోషూట్ వైరల్ అవుతుంది.
అందులో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారు శిరీష్. ట్రెంచ్ కోట్ (Trench Coat) ధరించిన ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..సూపర్ హీరోలంతా కేవలం కేప్స్ మాత్రమే ధరించరు.. కొందరు ట్రెంచ్ కోట్స్ కూడా వేసుకుంటారు అంటూ రాసుకొచ్చారు. ట్రెంచ్ కోట్ ధరించి అల్లు శిరీష్ ఇచ్చిన పోజులు నిజంగానే సూపర్ హీరోను తలపిస్తున్నాయి. ఈ లుక్‌లోకి రావడానికి తనను తాను చాలా మార్చుకున్నారు అల్లు శిరీష్. దీని కోసం వర్క్ఔట్స్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు ఈయన.
‘గౌరవం’ సినిమాతో హీరోగా పరిచయమైన శిరీష్..‘శ్రీరస్తు శుభమస్తు’, ‘కొత్త జంట’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు..కమర్షియల్ సినిమాల కంటే కూడా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు శిరీష్. ‘ఎబిసిడి’ హిందీ డబ్బింగ్ సినిమాతో ఉత్తరాదిన కూడా క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ మద్య ‘విలాయటి శరాబ్’ అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్‌తో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సత్తా చాటారు. ‘ఎబిసిడి’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శిరీష్.. ఇప్పుడు ప్రేమ కాదంట అనే సినిమాతో వస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!