Allu Ramalingaiah | లెజెండరీ నటులు, నిర్మాత (దివంగత) పద్మ శ్రీ, డాక్టర్ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) 101వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు అల్లు ఫ్యామిలీ ఘనంగా నివాళులర్పించింది. జయంతి సందర్భంగా అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు బిజినెస్ పార్క్‌తోపాటు ఆయన కాంస్య విగ్రహాన్ని అల్లు అరవింద్ మనవడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ దంపతులతోపాటు, అల్లు శిరీష్, కొణిదెల సురేఖ, అల్లు అయాన్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు రామలింగయ్య సేవలకు కొనసాగింపుగా ఇప్పటికే హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతం ( Gandipet area)లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫిల్మ్ స్టూడియో ( State of the art film studio )ను ఏర్పాటు చేశారని తెలిసిందే. ఫిల్మ్ మేకింగ్‌కు అవసరమైన అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో 10 ఎకరాలకుపైగా ఈ స్టూడియోలో ఏర్పాట్లు చేశారు.
అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూనే..మరోవైపు అల్లు అర్జున్ ద్వారా అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని తెలిసిందే. శిరీష్ కూడా యాక్టింగ్‌లో కొనసాగుతుండగా..బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఫొటోలు..
Allu Business Park and the bronze statue of Padma Shri Dr. #AlluRamalingaiah were inaugurated today on the occasion of his 101st Birth Anniversary. The entire family paid their respects, and the bronze statue was unveiled by #AlluAyaan pic.twitter.com/fpKDzf5DVv
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2023
వీడియో..
Highlights from the launch of Allu Business Park and the bronze statue inauguration of Padma Shri Dr. #AlluRamalingaiah garu on the occasion of his 101st Birth Anniversary. #AlluArjun @alluarjun @GeethaArts @GA2Official #AlluAravind pic.twitter.com/5CzGZW9vog
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2023