Allu Family | ఘనంగా అల్లు అరవింద్ పెళ్లిరోజు వేడుకలు .. మొత్తం కుటుంబం ఒకే ఫ్రేమ్‌లో, ఫోటోలు వైరల్
Allu Family | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. అల్లు అరవింద్ – నిర్మల దంపతుల 52వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను ఇంట్లోనే గ్రాండ్‌గా నిర్వహించడం విశేషం. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇటీవల వివాహం చేసుకున్న అల్లు శిరీష్ – నయనిక రెడ్డి జంట దగ్గరుండి నిర్వహించారు.
Allu Family | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. అల్లు అరవింద్ – నిర్మల దంపతుల 52వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను ఇంట్లోనే గ్రాండ్‌గా నిర్వహించడం విశేషం. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇటీవల వివాహం చేసుకున్న అల్లు శిరీష్ – నయనిక రెడ్డి జంట దగ్గరుండి నిర్వహించారు. కుటుంబ సభ్యులందరినీ ఒకేచోట చేర్చి, ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులందరూ కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోల్లో అల్లు అరవింద్, ఆయన భార్య నిర్మలతో పాటుపెద్ద కొడుకు అల్లు బాబీ – కోడలు నీలు షా, రెండో కొడుకు అల్లు అర్జున్ – కోడలు స్నేహారెడ్డి, మూడో కొడుకు అల్లు శిరీష్ – కోడలు నయనిక రెడ్డి ఉన్నారు.
చాలా రోజుల తర్వాత అందరూ కలిసి కనిపించడంతో ఈ ఫ్యామిలీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ముగ్గురు కొడుకులు, కోడళ్లతో కలిసి ఉన్న అల్లు అరవింద్ ఫ్యామిలీ ఫోటోను అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. అల్లు కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అల్లు అరవింద్ పెళ్లిరోజు వేడుకలు కుటుంబ సమేతంగా జరగడం, ఆ ఫోటోలు వైరల్ కావడం అభిమానుల్లో ఆనందాన్ని నింపాయి. అల్లు ఫ్యామిలీ బాండింగ్ మరోసారి అందరినీ ఆకట్టుకుంది.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం రాగా, ఈ మూవీపై అంచనాలు బారీగా ఉన్నాయి. బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 2027లో విడుదల చేయనున్నారు. మూవీపై భారీ అంచనాలు ఉండగా, ఈ సినిమా అనేక రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

