Allu Ayaan | అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరో కాగా, ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా అందిపుచ్చుకున్నాడు. పుష్ప రెండు పార్టులతో ఆయనకు భారీగా ఇమేజ్ వచ్చింది. బాహుబలి సినిమాను దాటి కలెక్షన్లు సాధించింది పుష్ప2 సినిమా. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే బన్నీ, స్నేహా రెడ్డి దంపతులకి అయాన్, అర్హ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అల్లు స్నేహా రెడ్డి తాజాగా అయాన్ బర్త్ డే సందర్భంగా ఓ క్యూట్ పోస్ట్ షేర్ చేశారు
అయాన్ అల్లరి చేష్టలకు సంబంధించిన ఫోటోలు, విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక అయాన్ గురించి కొన్ని విషయాలు చెబుతూ బర్త్ డే విషెస్ చెబుతూ.. అయాన్ ప్యూర్ సోల్ అని, చాలా ఫుడ్డీ అని చెప్పుకొచ్చారు. అయాన్ మళ్లీ నెక్ట్స్ వెకేషన్ ట్రిప్, ప్లానింగ్ ఎప్పుడు వేస్తావ్? ఆ ట్రిప్‌లో మా అందర్నీ ఎప్పుడు నవ్విస్తావ్ అంటూ అల్లు స్నేహా రెడ్డి పోస్ట్ వేశారు. అయాన్‌కు బన్నీ ఫ్యాన్స్ కూడా ఇన్ స్టాలో విషెస్ తెలియజేశారు. స్నేహా రెడ్డి పోస్ట్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. అయాన్ వీడియోలు నెట్టింట్లో ఎంతగా నవ్విస్తాయో అందరికీ తెలిసిందే. మీమర్స్ అయాన్ వీడియోల్ని నెట్టింట తెగ వైరల్ చేస్తుంటారు.
అల్లు అర్జున్‌కి అతని భార్య స్నేహ రెడ్డి అన్నా , పిల్లలు అన్నా కూడా ప్రాణం. ఈ జంట ఎప్పటి కప్పుడు తమ స్ట్రాంగ్ బాండింగ్ ను రకరకాల రూపాల్లో వెల్లడిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వీరి పోస్ట్ ల ద్వారా ఒకరికొకరు ఎంత ప్రేమించుకుంటున్నారో ఫ్యాన్స్ కు అర్ధం అవుతూనే ఉంది. ఇక పెళ్ళి తరువాత భారీగా ఆస్తులు కూడబెట్టాడట బన్నీ. వరుస విజయాలతో రెమ్యునరేషన్ భారీగా పెంచడంతో పాటు.. రకరకాల బిజినెస్ లలో బెట్టుబడులు పెట్టి కోట్లు వెనకేసుకొస్తున్నారు.