‘పుష్ప’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. దీంతో ట్రైలర్ చూడాలనే ఆతృత పెరిగింది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 6న ‘పుష్ప’ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకురానుంది. సోమవారం ట్రైలర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చిత్తూరు నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో స్మగ్లర్ పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ తన కెరీర్లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న పుష్పరాజ్‌తో జోడీకడుతున్నది. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్‌రావు, అజయ్‌ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, ఆర్ట్: రామకృష్ణ-మోనిక, సహనిర్మాతలు: ముత్తంశెట్టి మీడియా, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, దర్శకత్వం: సుకుమార్.