Pushpa 3 | ప్రస్తుతం తెలుగు రాష్ర్టాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప-2’ సందడి నెలకొని ఉంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకురాబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగింపుగా ‘పుష్ప-3’ గురించి ఆసక్తికరమైన వార్తలు బయటికొస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసినా రసూల్ పూకుట్టి తన సోషల్‌మీడియా ఖాతాలో ఓ ఫొటో షేర్ చేశారు.
తన టీమ్‌తో కలిసి తీయించుకున్న ఈ ఫొటో వెనక ‘పుష్ప-3’ (ది ర్యాంపేజ్) అనే పోస్టర్ డిస్ప్లే కనిపిస్తున్నది. దీంతో ‘పుష్ప-3’ ఖాయంగా రానుందని, పార్ట్-2 ైక్లెమాక్స్ ఎండింగ్లో మూడో భాగానికి చెందిన లీడ్‌ను ఇవ్వనున్నారని చెబుతున్నారు. తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా దర్శకుడు సుకుమార్ పార్ట్-3 గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు స్పందించారు. అల్లు అర్జున్ తనకోసం మళ్లీ మరో మూడేళ్ల సమయం కేటాయిస్తే తప్పకుండా ‘పుష్ప-3’ చేస్తానని అన్నారు. అయితే ‘పుష్ప-2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్‌లకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాతే ‘పుష్ప-3’ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప-3’ పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నది.