‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు హీరో అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సంచలన విజయం సాధించింది. అక్కడి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయేలా వసూళ్లు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.
ఈ ఫాలోయింగ్‌ను చూపించేలా ఆయన తాజా ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలుసు.దానికి పూర్తి భిన్నమైన గెటప్‌లో ఆయన కనిపించారు. బ్లేజర్, గ్లాసెస్, సిగార్‌తో ఉన్న అల్లు అర్జున్ పిక్ కొత్తగా ఉంది. ‘పుష్ప 2’ షూటింగ్ కోసం సిద్ధమవుతున్న అల్లు అర్జున్…తాజాగా కొన్ని వాణిజ్య ప్రకటనలు చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారు. ఆ యాడ్‌లో భాగంగా ఈ లుక్‌లో కనిపించారు.