Allu Arjun wishes his father on his birthday | పుష్ప 2 ఘటనతో అల్లు ఫ్యామిలీలో చికటి కమ్ముకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చగా.. అతడికి 14 రోజు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించగా.. తెలంగాణ హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో బెయిల్ మీద బయటికి వచ్చాడు బన్నీ. అయితే రీసెంట్గా బెయిల్ గడువు కూడా ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం ఆప్లయ్ చేసుకోగా.. నాంపల్లి కోర్టు బన్నీకి పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఈ ఘటనతో అటు టాలీవుడ్‌తో పాటు అల్లు ఫ్యామిలీని చాలా సైలెంట్ అయిపోయింది. అల్లు అర్జున్ బయటరు రాకుండా ఇంట్లోనే ఫ్యామిలీతో గడుపుతున్నాడు.
అయితే చాలా రోజులు తర్వాత తన తండ్రి అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మా జీవితాల్ని ఇంత స్పెషల్‌గా మార్చినందుకు థాంక్యూ. ఇదంతా మీ వల్లే అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు. దీనికి రెండు ఫొటోలను కూడా జత చేశాడు. ఇందులో ఒక కేకుకి పుష్పకి బాప్ బర్త్‌డే (పుష్ప తండ్రి బర్త్‌డే) అంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన కేకుని అల్లు అరవింద్‌తో కట్ చేయించారు. కాగా ఈ ఫొటోలను మీరు చూసేయండి.
Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF
— Allu Arjun (@alluarjun) January 10, 2025