Atlee Birthday | టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు కావడంతో బన్నీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు అట్లీ. ఈ సంవత్సరం నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. మీరు సృష్టిస్తున్న సినిమాటిక్ మాయాజాలాన్ని అందరూ అనుభవించే వరకు వేచి ఉండలేను అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు. అట్లీ గతంలో ‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తుండగా.. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
Happy Birthday to my dearest director @Atlee_dir garu. May abundance shower upon you. Wishing you all the joy, love, and prosperity. Can’t wait for everyone to experience the cinematic magic you’re creating 🖤 pic.twitter.com/Sb7S8Bfpmp
— Allu Arjun (@alluarjun) September 21, 2025