David Warner | ఒకప్పటి ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్, దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు (Birthday Wishes) వెలువెత్తుతున్నాయి. క్రీడ రంగానికి చెందిన ప్రముఖులు డేవిడ్ భాయ్ కి విషెస్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ క్రికెట్ సూపర్ స్టార్‌కి తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో డేవిడ్ వార్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు కోరుకున్నవన్నీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’. అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చారు. అయితే డేవిడ్ వార్నర్ రిప్లయ్ ఇస్తూ.. ధన్యావాదాలు అల్లు అర్జున్ గారు. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నా అంటూ రాసుకోచ్చారు.
Allu Arjun wishes David Warner a very Happy birthday ❤️
– The Pushpa boys…!!! pic.twitter.com/umMEUj31Nd
— Johns. (@CricCrazyJohns) October 27, 2024