Balakrishna Padma Bushan | తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను బాలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఇక బాలయ్యకు పద్మా రావడంతో సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్‌ని అందుకున్న అల్లు అర్జున్ కూడా బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపాడు.
ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినిమా రంగానికి అందించిన కృషికి ఈ గుర్తింపుకు మీరు అర్హులు అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు. బాలయ్యతో పాటు పద్మభూషణ్ వరించిన నటుడు అజిత్ కుమార్‌తో పాటు శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్‌లకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపాడు.
Heartfelt congratulations to #NandamuriBalakrishna garu on receiving the prestigious #PadmaBhushan award, this recognition is well-deserved for your contributions in telugu cinema.
My dear #AjithKumar garu, your achievement is equally inspiring and commendable.
Also…
— Allu Arjun (@alluarjun) January 27, 2025