Allu Arjun – Atlee Movie | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు కాంబోలో చిత్రం తెరక్కనున్నది. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ది రూల్ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.1870 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సల్మాన్ ఖాన్, నయనతార, దీపికా పదుకొనే చిత్రంలో నటించారు. ఈ రెండు సినిమాల తర్వాత అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్‌తో అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నది.
Janhvi Kapoor
ఈ మూవీ ప్రకటించిన నాటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. క్రేజీ ప్రాజెక్టు కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లను సైతం రంగంలోకి దించబోతున్నారు. ఇక మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోనున్నట్లు సమాచారం. ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరును దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది. మరో హీరోయిన్ కోసం దిశ పటానీ, శ్రద్ధ కపూర్‌లలో ఎవరో ఒకరిని తీసుకోనున్నారని.. ఈ మేరకు ఆ హీరోయిన్లతో చర్చలు జరుగుతున్నట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తుండగా.. ఇందులో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తున్నది.
ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్ హాలీవుడ్ స్టూడియోలు సైతం ఈ ప్రాజెక్టులో పని చేయనున్నారు. అలాగే, బాలీవుడ్ బడా స్టార్ విలన్ పాత్ర పోషిస్తారని తెలుస్తున్నది. అతను ఎవరో ఇంకా తెలియరాలేదు. జాన్వీ కపూర్ కపూర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీలోని హీరోయిన్గా నటిస్తున్నది.
Disha Patani
దిశా పటాని 2015లో తెలుగులో ‘లోఫర్’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. చివరిసారిగా తెలుగులో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో కనిపించింది. శ్రద్ధా కపూర్ ఇప్పటి వరకు నేరుగా తెలుగులో సినిమాలు చేయలేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన ద్విభాషా చిత్రం ‘సాహో’లో నటించింది. అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నారని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బన్నీ అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.