Allu Arjun | అల్లు కుటుంబంలో ఏ చిన్న వేడుక జరిగిన ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే కనిపిస్తుంటారు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరూ వస్తుంటారు. అలాంటిది అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహావిష్కరణలో అల్లు అర్జున్ మిస్ అయ్యాడు. ఆయన కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఎక్కడికెళ్లాడు.. తాత కంటే ఇంపార్టెంట్ పని ఏముంది అంటూ చర్చ మొదలైంది.
అయితే బన్నీ లేకపోయినా ఆయన కొడుకు అల్లు అయాన్ చేతుల మీదుగా అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ జరిగింది. తన ముత్తాత గురించి మురిసిపోతూ చెప్పాడు అల్లు అయాన్. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, శిరీష్ సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ కనిపించకపోవడానికి కారణం ఆయన ఇండియాలో లేడు. ఈ మధ్య సతీ సమేతంగా ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు బన్నీ. గతవారం సతీమణి స్నేహ రెడ్డి పుట్టినరోజు ఉండడంతో.. ఆమెను తీసుకొని ఫారెన్ వెళ్ళాడు బన్నీ. అక్కడే బర్త్ డే సెలబ్రేట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇక్కడ లేడు కాబట్టే తాత విగ్రహావిష్కరణ సభలో కనిపించలేదు బన్నీ.
తను లేకపోయినా తన వారసుడితో ఆవిష్కరణ చేయించాడు. ఇదిలా ఉంటే అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య 101వ జయంతి జరిగింది. గతేడాది ఆయన శత జయంతి వేడుకలు ఘనంగా జరిపారు అల్లు కుటుంబ సభ్యులు. ఈసారి కాంస్య విగ్రహావిష్కరణ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో 1000కి పైగా సినిమాలో నటించి లెజెండరీ హోదా అందుకున్న అల్లు రామలింగయ్య.. 2002లో అనారోగ్యంతో కన్నుమూశారు. చనిపోయే వరకు కూడా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చి రామలింగయ్య పేరు నిలబెడుతున్నారు ఆయన వారసులు.