Allu arjun In Abudhabi | పుష్ప 2 ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అబుదాబిలోని బీఏపీఎస్ స్వామినారాయణ మందిర్‌ను సందర్శించారు. ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించిన ఆయన.. అనంతరం నారాయణ స్వామిని దర్శించుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అబుదాబిలోని ఈ ప్రసిద్ధ హిందూ మందిరం, మధ్యప్రాచ్యంలోనే తొలి సాంప్రదాయిక రాతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 2024 ఫిబ్రవరి 14న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబడింది.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం జవాన్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ సంబంధించి చర్చలు జరుగుతుండగా.. బన్నీ హైదరాబాద్‌కి వచ్చిన అనంతరం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది.