Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవలే లండన్ వెకేషన్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చాడని తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా సినిమా పుష్ప.. ది రూల్ షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే బన్నీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas)తో నాలుగో సినిమా చేస్తున్నాడని ఇప్పటికే అప్డేట్ కూడా వచ్చేసింది.
మహేశ్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం పూర్తి చేసిన తర్వాత బన్నీ మూవీ (AA22)ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడట త్రివిక్రమ్. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. బన్నీ-త్రివిక్రమ్ సినిమా రెండు పార్టులుగా వచ్చే అవకాశాలున్నాయట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. సినిమా రెండు పార్టులుగా వచ్చే అవకాశాలున్నాయని, అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
నాగవంశీ హింట్‌తో బన్నీ-త్రివిక్రమ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతుందని క్లారిటీ వచ్చేసిందంటూ.. ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్. మరి దీనిపై రానున్న రోజుల్లో ఏదైనా అప్డేట్ అందిస్తారేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నెటిజన్లు, ప్రేక్షకులు. గుంటూరు కారం సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. పుష్ప.. ది రూల్ 2024 ఆగస్టు 15న రిలీజ్ కానుంది.