Allu Arjun – Atlee Project | తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా రాబోతున్న సినిమాపై సాలిడ్ రూమర్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్తలు అటు సోషల్ మీడియాతో పాటు ఇటు బీ టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. తాతగా, తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ కనిపించనున్నారని సమాచారం.
దర్శకుడు అట్లీ మొదట అల్లు అర్జున్‌ని రెండు పాత్రల కోసం, మిగిలిన రెండు పాత్రలకు ఇతర నటులను తీసుకోవాలని అనుకున్నారట. అయితే అల్లు అర్జునే స్వయంగా ఈ నాలుగు పాత్రలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో అట్లీ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నాలుగు పాత్రలకు సంబంధించి అల్లు అర్జున్‌పై లుక్ టెస్టులు నిర్వహించగా అవి అద్భుతంగా వచ్చినట్లు టాక్ నడుస్తుంది.
ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో, పునర్జన్మల కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుందని సమాచారం. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ టెక్నీషియన్ల సహకారంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె భాగం అవ్వగా.. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి పలువురు అగ్రతారలు ఈ సినిమాలో భాగం కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ విలన్ పాత్రలో కనిపించనున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.