‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్లో మంచి క్రేజ్‌ని సంపాదించారు బన్నీ. ‘జవాన్’తో బాలీవుడ్ రికార్డులన్నీ చెల్లాచెదురు చేశాడు దర్శకుడు అట్లీ. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే, అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్ అవ్వనున్నట్టు ఫిలింవర్గాల సమాచారం.
‘పుష్ప-2’ తర్వాత బన్నీ త్రివిక్రమ్‌శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ లోపు అట్లీతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ రెడీ అయినట్టు తెలుస్తున్నది. ఈ యాక్షన్ అడ్వంచరస్ మూవీని సాథ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని సంకల్పించారట దర్శకుడు అట్లీ. అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.