Allu Arjun | ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో బుధవారం రాత్రి పుష్ప 2 (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారని తెలిసిందే. రేవతిని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నాడు. కాగా ఈ ఘటనపై అల్లు అర్జున్ టీం స్పందించింది. నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన దురదృష్టకరం. ప్రస్తుతం శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా టీం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపింది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Tyson Naidu | బర్త్ డే స్పెషల్.. డీజే టిల్లు భామ టైసన్ నాయుడు లుక్ వైరల్
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?