ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సిరీస్ ద్వారా నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు శరత్చంద్ర నాయుడు. గతంలో ఆయన పెద్ద చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ వ్యవహారాల్ని పర్యవేక్షించేవారు. ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ విజయం సినీరంగంలో తన ప్రయాణానికి శుభారంభాన్నిచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శరత్చంద్ర నాయుడు తన భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు.
90వ దశకం తాలూకు జ్ఞాపకాలను పంచుకుంటూ.. ‘రేలంగి మావయ్య’ పేరుతో తాను మొదలుపెట్టిన పోడ్కాస్ట్కు అద్భుతమైన ఆదరణ దక్కిందని, ఆ కంటెంట్ నచ్చి ఈటీవీ విన్ వారు వెబ్‌సిరీస్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశమిచ్చారని, ఆ విధంగా ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ కార్యరూపం దాల్చిందని తెలిపారు.
తాను చాన్నాళ్లు అల్లు అర్జున్ టీమ్ సభ్యుల్లో ఒకరిగా పనిచేశానని, నిర్మాతగా సక్సెస్ కావడం పట్ల అల్లు అర్జున్ అభినందించారని, ఆయన ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్నిచ్చిందని శరత్చంద్ర నాయుడు పేర్కొన్నారు. ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌తో అల్లు అర్జున్ బృందం నుంచి మరో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ వచ్చాడని అందరూ ప్రశంసించడం ఆనందంగా ఉందని, సినీ మార్కెటింగ్‌లో అనుభవం వల్ల ప్రేక్షకుల అభిరుచులపై అవగాహన ఏర్పడిందని, ఆ నమ్మకంతోనే సిరీస్‌ను సృజనాత్మకంగా తీర్చిదిద్దానని శరత్చంద్ర నాయుడు తెలిపారు.