ఫిలింఫేర్ పురస్కారాల్లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా సత్తా చాటింది. బెంగళూరులో ఈ కార్యక్రమం జరిగింది. ‘పుష్ప’ సినిమాకు ఏడు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, మేల్ సింగర్, ఫీమేల్ సింగర్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డ్స్ వచ్చాయి. ‘లవ్‌స్టోరి’ చిత్రానికి సాయి పల్లవి ఉత్తమ నటి అవార్డ్ గెల్చుకుంది.