Sreeleela | ప్రస్తుతం టాలీవుడ్లో బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయిన భామ ఎవరంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు శ్రీలీల (Sreeleela). అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా ఏ విషయంలోనూ తనకు తానే పోటీ అని చెప్పకనే చెబుతోంది శ్రీలీల. నేడు ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు శ్రీలీలకు సంబంధించిన మరో అప్డేట్ మూవీ లవర్స్ లో ఫుల్ జోష్ నింపుతోంది. ఈ భామ డ్యాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఊర మాస్, స్టైలిష్ డ్యాన్స్‌తో ఇరగదీసే టాలీవుడ్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). శ్రీలీల-అల్లు అర్జున్ కలిసి డ్యాన్స్ చేస్తున్నారంటే పక్కా విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. నేడు ఆహా మేకర్స్.. బన్నీ-శ్రీలీల సూపర్ డ్యాన్సింగ్ స్టిల్‌ను షేర్ చేశారు. ఇంతకీ ఈ ఇద్దరు ఏదైనా సినిమా చేస్తున్నారా..ఏంటనుకుంటున్నారా.. ? అలాంటిదేమి లేదు. ఈ ఇద్దరు ఆహా ఒరిజినల్ కమర్షియల్ ప్రాజెక్ట్ కోసం ఇలా మారిపోయారు. వీళ్లు కలిసి స్టెప్పేస్తే బొమ్మ బ్లాక్ బస్టరే.. అతిపెద్ద మూవీ పండుగ చేసుకుందామా.. గెట్ రెడీ ఫర్ ఎంటర్టైన్మెంట్ సునామి.. అంటూ ఈ అప్డేట్ అందించారు.
త్వరలోనే ఈ కమర్షియల్ విడుదల కానుంది. శ్రీలీల ప్రస్తుతం నటిస్తోన్న సినిమాలన్నీ భారీ ప్రాజెక్ట్‌లే కావడం విశేషం. ఉస్తాద్ భగత్‌సింగ్, నితిన్ 32, బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబోలో వస్తున్న Rapoలో ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తోంది శ్రీలీల .
బొమ్మ బ్లాక్‌బస్టరే..
He is Iconic ⭐she is dreamy 💃. Veellu kalisi steppeste bomma blockbuster e🔥. Presenting @sreeleela14, our heroine for next aha Original…
Athi pedda ‘Movie’ Panduga cheskundama..?
Get ready for entertainment ‘tsunami’ 🎬🌊#AAtakesoverAha @alluarjun pic.twitter.com/7EK4DkbZT0— ahavideoin (@ahavideoIN) June 14, 2023