Allu Arjun | పుష్ప.. ది రైజ్ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఓ వైపు ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ తో తీరిక లేకుండా ఉండే బన్నీ.. సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. అల్లు అర్జున్‌కు నేడు ప్రత్యేకమైన రోజు. అల్లు అర్జున్- స్నేహ (Allu Sneha Reddy) దంపతులు నేడు 12వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా భార్య స్నేహారెడ్డితో కలిసి వెకేషన్‌కు వెళ్లినప్పుడు దిగిన సెల్ఫీని అల్లు అర్జున్ షేర్ చేస్తూ.. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. అల్లు స్నేహారెడ్డి’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు, ఫాలోవర్లు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప.. ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
యాక్షన్ ఎంటర్టైనర్గా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న సీక్వెల్ పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అల్లు అర్జున్-స్నేహ సెల్ఫీ..
Happy Anniversary Cutie 🖤 #AlluSnehaReddy pic.twitter.com/lWEJRfuQZH
— Allu Arjun (@alluarjun) March 6, 2023
Read Also :
Dasara | దసరా మూడో సాంగ్.. ఛమ్కీలా అంగీలేసి ప్రోమో అదిరింది
Ghosty | కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
Saindhav | వెంకటేశ్ సైంధవ్‌లో హీరోయిన్ ఫైనల్.. ఇంతకీ ఎవరో తెలుసా..?