Allu Arjun | కరోనా లాక్ డౌన్ ముందు అల్లు అర్జున్ గోవాలోని ఒక వైన్ షాప్‌లో మందు తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో అప్పట్లో ఫుల్ వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోకు సంబంధించిన ప్రస్తావనను తాజాగా బాలకృష్ణ తన అన్‌స్టాపబుల్ షోలో తీసుకువచ్చారు.
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05 వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు బన్నీ. తాజాగా బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ఆన్స్టాపబుల్ సీజన్ 4కి కూడా ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే ఈ షోలో బాలకృష్ణ బన్నీని అడుగుతూ.. గోవా వైన్ షాప్‌లో ఏం చేస్తున్నావు అంటూ అడిగాడు.
దీనికి అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. నేను మందుకు చాలా దూరం సర్. అప్పుడు గోవాలో నా పేరు సూర్య సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే నా ఫ్రెండ్ ఒకడు గోవాకు వచ్చాడు. సరే కలిసాం కదా అని ఏం తాగుతావు అంటే ఒక బ్రాండ్ పేరు చెప్పాడు. అది రెస్టో బార్లో ఉన్న బాయ్‌కి చెబితే తనకి అర్థం కావడం లేదని చెప్పాడు. దీంతో నేనే స్వయంగా వెళ్లి ఆ మందు తీసుకుని వచ్చాను. అక్కడ సీసీటీవి ఉండడంతో ఆ వీడియో బయటకు వచ్చి వైరల్ అయ్యింది అంటూ అల్లు అర్జున్ చెప్పుకోచ్చాడు.
Allu arjun in goa wine shop pic.twitter.com/DYycuQ4H1C
— Tyler. (@i_am_SR12) October 22, 2024