సాధారణంగా ఏవైన వేడుకలకు లేదంటే పండుగలకు మెగా ఫ్యామిలీ అంతా ఒక్క చోటచేరి పండుగను సరదాగా జరుపుకుంటూ ఉంటారు. ఈసారి దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ దీపావళి విషెస్ తెలియజేస్తూ ఫొటో షేర్ చేయగా, ఇందులో రామ్ చరణ్,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక,చైతన్య, వైష్ణవ్ తేజ్ తో పాటు పలువురు మెగా కుటుంబ సభ్యుల ఉన్నారు. చూస్తుంటే ఈ పండగను వీరు ఘనంగా జరుపుకుంటున్నారని తెలుస్తుంది.
సాయి ధరమ్ తేజ్ ఈ సారి మిస్ అయ్యాడు. ఇటీవల జరిగిన ప్రమాదం వలన తేజ్ పూర్తిగా బెడ్‌కే పరిమితం అయ్యాడు. అందుకే ఈ గ్రూప్ ఫొటోలో లేరని అంటున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ డిసెంబర్ 17న పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. రామ్‌చరణ్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంతో పలకరించనున్నాడు. జనవరి 7న చిత్రం విడుదలవుతుంది. ఇందులో రామ్‌చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు.