Allu Arjun- Vijay | చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో కెరియర్లో హిట్స్ తక్కువే అయిన ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విజయ్‌కి అల్లు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. గీతా ఆర్ట్స్‌లో విజయ్ గీతగోవిందం సినిమా చేశాక.. టాక్సీవాలా అంటూ ఎస్ కే ఎన్తో పని చేశాడు. అలా బన్నీ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. పలు సందర్భాల్లో ఇద్దరు హీరోలు కూడా ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని చూపించుకోవడం మనం చూశాం. రౌడీ బ్రాండ్ దుస్తుల్ని బన్నీకి ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాడు విజయ్ దేవరకొండ. తాజాగా అలానే తన కొత్త డిజైన్లను బన్నీకి పంపించేశాడు.
Bunny
రౌడీ బ్రాండ్‌కు టాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో, రౌడీ వేర్స్‌కు యూత్‌లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. రౌడీ బ్రాండ్స్‌కి సంబంధించిన ఏదైన కొత్త డిజైన్స్ వస్తే వెంటనే వాటిని అల్లు అర్జున్‌కి పంపిస్తారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ..అల్లు అర్జున్‌కు రౌడీ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేకమైన డ్రెస్సులు పంపించారు. అలానే బన్నీ పిల్లల కోసం బర్గర్లు కూడా గిఫ్ట్‌గా పంపించారు. విజయ్ గిఫ్ట్‌లు చూసి బన్నీ తెగ ఫిదా అయ్యాడు. లవ్ యూ బ్రదర్.. నీ ప్రేమకు థాంక్యూ అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. దీనికి విజయ్ కూడా స్పందిస్తూ.. ‘లవ్ యూ అన్నా.. మన రిలేషన్ ఇలానే కొనసాగుతాయంటూ ప్రేమపూర్వకంగా స్పందించారు.
మరి ఈ దుస్తుల్ని బన్నీ ఎప్పుడు ధరిస్తాడో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే బన్నీ ప్రస్తుతం అట్లీ మూవీతో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గానే బన్నీ అట్లీ మూవీ ప్రకటన రాగా, ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంతో బన్నీ రేంజ్ హాలీవుడ్ వరకు వెళుతుందని అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం కింగ్ డమ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే విజయ్ డబ్బింగ్ పనుల్ని కూడా పూర్తి చేశాడు. ఈ మూవీని త్వరగా ఫినిష్ చేసి రౌడీ జనార్ధన సెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు. దీని తర్వాత రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్, సుకుమార్ ప్రాజెక్ట్ ఒకటి చేయాల్సి ఉంది.