Director Vetrimaaran | ఇండియాలోని గొప్ప దర్శకుల లిస్ట్ తీస్తే అందులో వెట్రిమారన్ పేరు కచ్చితంగా ఉంటుంది. తీసింది అయిదు సినిమాలే అయినా.. ప్రతీ సినిమా ఒక అద్భుతమే. అవార్డుల సైతం ఆయన సినిమాలకు దాసోహం అవుతుంటాయి. భాషతో సంబంధంలేకుండా ప్రతీ ఒక్కరు వెట్రిమారన్ సినిమాలను ఆదరిస్తుంటారు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన విడుతలై పార్ట్-1 రిలీజై కోట్లు కొల్లగొడుతుంది. కమెడియన్‌ను హీరోగా పెట్టి భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించాడంటేనే వెట్రిమారన్ స్థాయేంటో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాజమౌళికి ఎంత్ర క్రేజ్ ఉందో.. తమిళంలో వెట్రికి అంతే క్రేజ్ ఉంది. ఆయనతో సినిమా చేయాలని ఎంతో మంది స్టార్లు ఆరాటపడుతుంటారు.
అలాంటిది ఆయన సినిమాకు బన్నీ నో చెప్పాడట. ఇదే విషయాన్ని స్వయంగా వెట్రి తెలిపాడు. వెట్రి తెరకెక్కించిన విడుతలై తెలుగు వెర్షన్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్మీట్లో వెట్రీ సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. ఈ నేపథ్యంలో అడాకులం సినిమా తర్వాత వడ చెన్నై స్క్రిప్ట్‌తో అల్లు అర్జున్ను కలిశానని, కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని తెలిపాడు. ఇక వడ చెన్నై సినిమా ధనుష్‌కు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా తన మార్కెట్‌ను కూడా రెండింతలు చేసింది. అల్లుఅర్జున్ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్సయ్యాడని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడంటే పుష్ప వల్ల బన్నీకి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది కానీ, ఐదేళ్ల క్రితం టాలీవుడ్ తప్పితే మిగితా భాషల్లో బన్నీకి పెద్దగా క్రేజ్ లేదు. ఇక అప్పుడే వడ చెన్నై చేసుంటే తమిళంలో అల్లు అర్జున్‌కు యమ క్రేజ్ వచ్చేది.