Pushpa 2 The Rule | పాన్ ఇండియా, గ్లోబల్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ టాలీవుడ్ సినిమా పుష్ప ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. పుష్ప ప్రాంఛైజీలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.
దీనిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చేసినట్టు అర్థమవుతోంది. ఇంతకీ ఎలా అనుకుంటున్నారా..? అల్లు అర్జున్‌కు చాలా సన్నిహితుడైన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర నాయుడు చేసిన తన ట్వీట్‌తో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడని అర్థమవుతోంది. పుష్ప ది రూల్ వాయిదా పడటం లేదని ఒక్క ట్వీట్ మా మొహానా పడేయ్ అన్నా..అనే ట్వీట్‌ను ఓ వ్యక్తి శరత్చంద్రకు ట్యాగ్ చేశాడు. దీనికి శరత్ చంద్ర నాయుడు స్పందిస్తూ.. చేయలేను.. ఎందుకంటే అవుతుంది కాబట్టి.. అని రీట్వీట్ చేశాడు. ఈ రియాక్షన్‌తో ఇక పుష్ప ది రూల్ వాయిదా దాదాపు ఖరారైనట్టు అర్థమవుతుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన చాలా వర్క్ పెండింగ్‌లో ఉండటమే వాయిదాకు కారణమని టాక్ నడుస్తోంది.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు. ఇటీవలే లాంఛ్ చేసిన కపుల్ సాంగ్ సూసేకి (Sooseki) పాట తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్, 1.67 మిలియన్లకుపైగా లైక్స్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచిందని తెలిసిందే. దీంతోపాటు ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ కూడా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
పుష్ప ది రూల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
@imsarathchandra okka tweet maa mohana padey anna postpone avvatledhu ani🤧
— ᴄʜɪɴɴᴀ AA ᶜᵘˡᵗ🐉 (@CHINNA745) June 17, 2024