Allu Arjun Pushpa 2 | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ వచ్చింది. బన్నీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ‘పుష్ప ది రూల్’ చిత్రం డిసెంబర్ 05న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు పుష్ప 2 టీమ్ భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రెస్ మీట్ ఇండియాలోని పుష్ప విడుదలయ్యే అన్ని రాష్ట్రాల నుంచి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు. ఇక ఈ ప్రెస్ మీట్లోనే పుష్ప 2 అఫీషియల్ విడుదల తేదీని ప్రకటించారు. దీంతో చెప్పినరోజు కంటే ఒకరోజు ముందే వస్తుండటంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
The celebrations begin a day earlier 🥳
The fireworks at the box office will set off a day earlier 🔥
The records will be hunted down a day earlier 💥
Pushpa Raj’s Rule will begin a day earlier ❤🔥The Biggest Indian Film #Pushpa2TheRule GRAND RELEASE WORLDWIDE ON 5th… pic.twitter.com/AFckFRWt47
— Pushpa (@PushpaMovie) October 24, 2024