సుకుమార్ నా డైరెక్టర్ కాదు.. నా లైఫ్..
“నన్ను కన్న ఈ నేలకు వందనం. ప్రమోషన్స్‌కి చాలా ప్లేస్‌లకు వెళ్తుంటా. కానీ చెన్నైకి వస్తే ఆ ఫీలే వేరు. నా మొదలు ఇక్కడే కాబట్టి అదో సైకలాజికల్ ఫీలింగ్. నా తొలి 20ఏళ్లు చెన్నైలోనే ఉన్నా. ఈ సంస్కృతే నన్ను తయారు చేసింది.
“నన్ను కన్న ఈ నేలకు వందనం. ప్రమోషన్స్‌కి చాలా ప్లేస్‌లకు వెళ్తుంటా. కానీ చెన్నైకి వస్తే ఆ ఫీలే వేరు. నా మొదలు ఇక్కడే కాబట్టి అదో సైకలాజికల్ ఫీలింగ్. నా తొలి 20ఏళ్లు చెన్నైలోనే ఉన్నా. ఈ సంస్కృతే నన్ను తయారు చేసింది. నేను సాదాసీదా చెన్నై టి నగర్ కుర్రాడ్ని. డైరెక్టర్ సుకుమార్ నా డైరెక్టర్ కాదు. నా లైఫ్. తను లేకపోతే నేను లేను. ‘పుష్ప’తో నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. దేవిశ్రీ అందరికీ గొప్ప మ్యూజిక్ ఇస్తాడు. నాకు ప్రేమతో కలిపి ఇస్తాడు. నాలుగేళ్లు ఒకే హీరోయిన్‌తో జర్నీ చేశా. తనే రష్మిక. ఇందులో తన నట విశ్వరూపం చూస్తారు. నిజంగా శ్రీలీల డాన్సింగ్ క్వీన్.
తనతో డ్యాన్స్ అంటే ఫస్ట్‌టైమ్ కాస్త జాగ్రత్త పడ్డా. ‘పుష్ప2’ టీమ్ ఓ అద్భుతం. డిసెంబర్ 5న ప్రేక్షకులకు పండుగే. ఎక్కడా తగ్గేదేలే..” అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం డిసెంబర్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్‌ని దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగం ఆదివారం చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలోనే ఈ సినిమాలోని ‘కిస్సిక్’ సాంగ్‌ని లాంచ్ చేశారు. కథానాయికలు రష్మిక మందన్నా, శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, అర్చన కల్పాతి, కలైపులి ధాను, ఆదిత్యరామ్, డైరెక్టర్ నెల్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

