Allu Arjun Press Meet | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నాడు. పుష్ప 2 విడుదల సందర్భంగా.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై అల్లు అర్జున్ నేడు రాత్రి 7 గంటలకు మీడియా ముందు స్పందించనున్నట్లు తెలుస్తుంది.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందన్నారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతా రహితంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. 11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో, నిర్మాత వెళ్లలేదని.. బాధిత కుటుంబాన్ని హీరో, నిర్మాత పరామర్శించలేదన్నారు. ఒక్క రోజు హీరో జైలుకు వెళ్లి వస్తేనే.. సినిమావారంతా ఇంటికి పరామర్శలకు క్యూ కట్టారని.. అల్లు అర్జున్‌కు ఏమైనా కన్ను పోయిందా..? కాళ్లు పోయాయా? చేతులు పోయినవా..? కిడ్నీలు కరాబైనయా? ఎందుకు వెళ్లారు? అక్కడ ఒక తల్లి చనిపోయింది.. కొడుకు బ్రెయిన్‌డెడ్‌తో ఆసుపత్రిలో ఉన్నడు.. ఒక్కరైనా పరామర్శకు వెళ్లివచ్చారా? ఆయన టాలీవుడ్ ప్రముఖులపై మండిపడ్డారు.