Allu Arjun | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న వేళ, ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్న అల్లు అర్జున్, రామ్ చరణ్ నటనతో పాటు చిత్ర బృందం పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన అల్లు అర్జున్, “నిన్న రాత్రి ‘పెద్ది’ సినిమా చూశాను. రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబరిచాడు. ముఖ్యంగా ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అసాధారణంగా ఉంది. పాత్రలో పూర్తిగా లీనమై రా అండ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఎంతో గ్రేస్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ చరణ్ తన ప్రతిభను నిరూపించాడు. అతడిని చూస్తే నిజంగా గర్వంగా అనిపించింది. ఈ ప్రశంసలకు పూర్తిగా అర్హుడు” అంటూ కొనియాడారు.
రామ్ చరణ్‌తో పాటు సినిమాలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు నటనను కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రశంసించారు. జగపతి బాబు గారు, ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌కి కూడా అభినందనలు. సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అంతేకాకుండా దర్శకుడు బుచ్చిబాబు సానాపై కూడా ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన బుచ్చిబాబు సానాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయానికి కారణమైన మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ తన ట్వీట్‌ను ముగించారు.
ఇటీవల ‘పెద్ది’ విడుదలకు ముందు థియేటర్ల అద్దె విధానం, రెవెన్యూ షేరింగ్ అంశాలపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో పరిశ్రమలోని పలువురు నిర్మాతలు ఈ సినిమాకు మద్దతు ప్రకటించినప్పటికీ, విడుదల అనంతరం స్టార్ హీరోల నుంచి పెద్దగా స్పందనలు రాలేదు. ఈ నేపథ్యంలో ‘పెద్ది’పై బహిరంగంగా స్పందించి ప్రశంసించిన తొలి అగ్రహీరోగా అల్లు అర్జున్ నిలవడం విశేషంగా మారింది.బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, జగపతి బాబు, శివరాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. గ్రామీణ నేపథ్యంలో సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంటోంది.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…— Allu Arjun (@alluarjun) June 9, 2026